18 May, 2026 | 10:18 PM

వినోదన్న గెలిస్తే సంక్షేమం.. బండి వస్తే సంక్షోభం

22-04-2024 12:36 AM

ఎమ్మెల్యే గంగుల కమలాకర్

కరీంనగర్ సిటీ, ఏప్రిల్ 21: పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉండదని.. సీఎం రేవంత్‌రెడ్డి కుర్చీ కిందకు ఆ పార్టీ నాయకులే నీళ్లు తేవడం ఖాయమని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో జరిగిన బీఆర్‌ఎస్ ప్రచారంలో బీ వినోద్‌కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. ఐదేండ్ల పదవీ కాలంలో బండి సంజయ్ పార్టీ కోసమే పని చేశారని, ఎన్నడూ ప్రజల బాగోగులు పట్టించుకోలేద ని ఆరోపించారు. ప్రజల మనోభావాలతో బండి సంజయ్ రాజకీయం చేస్తున్నారని, గత పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్‌కి ఓట్లు వేసిన ప్రజలు ఇప్పుడు తిప్పలు పడుతున్నారని చెప్పారు.

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ను గెలిపిస్తే ప్రజల సమస్యలపై, సంక్షేమ పథకాల అమలు కోసం పార్ల మెంటులో కొట్లాడుతారని పేర్కొన్నారు. బండి సంజయ్‌కి ఓట్లేస్తే ప్రజలకు సంక్షోభం తప్పదని హెచ్చరించారు. బండి సంజయ్ ఏనాడూ పార్లమెంట్‌లో ప్రజాసమస్యలపై మాట్లాడలేదని అన్నారు. నిత్యం ప్రజల సం క్షేమం, అభివృద్ధి కోసం ఆరాటపడే వినోద్‌కుమార్‌నే ఎంపీగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, మాజీ కో ఆప్షన్ సభ్యులు జమీలోద్దీన్, కౌన్సిలర్లు మొండయ్య, వేణుగోపాల్, రాంబాబు, సత్యనారాయణరెడ్డి, విజయ రమేశ్, కో ఆప్షన్ సభ్యులు ఫక్రోద్దీన్, ప్రభాకర్, బీఆర్‌ఎస్ నాయకులు గోపాల్ రెడ్డి, శ్రీకాంత్, ఎస్‌కే బాబా, సుధాకర్, వెంకట్ రెడ్డి, కొమురయ్య, రుద్రరాధ, మహేశ్వరీ, కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.