5 March, 2026 | 6:03 AM

హోలీ వేడుకల్లో ఎమ్మెల్యే జీఎంఆర్

05-03-2026 02:40 AM

పటాన్చెరు, మార్చి 4 : హోలీ పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరులో నిర్వహించిన హోలీ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. బీరంగూడకు చెందిన కుమవత్ మార్వాడి సమాజం ఆధ్వర్యంలోని బృందం ఎమ్మెల్యే జిఎంఆర్ ను కలిసి తమ సాంప్రదాయ పద్ధతిలో హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ హోలీ పండుగ మనందరి జీవితాలలో ఐక్యత, ప్రేమ, ఆనందం నింపాలని అన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.