27 June, 2026 | 7:30 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

అందరి సహకారంతో ఆదర్శ మున్సిపాలిటీగా ఇస్నాపూర్

03-03-2026 12:36 AM

తొలి పాలకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ 

పటాన్ చెరు, మార్చి 2 :నూతనంగా ఏర్పడిన ఇస్నాపూర్ మున్సిపాలిటీని ప్రజా ప్రతినిధులు, ప్రజలు, అధికారులతో కలిసి రాష్ట్రంలోని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లక్డారం వార్డు కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ సుమలత అధ్యక్షతన ఏర్పాటు చేసిన పురపాలిక తొలి పాలకవర్గ సమావేశానికి ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నూతన పాలకవర్గం సభ్యులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.... పటాన్ చెరు నియోజకవర్గంలో నూతనంగా 5 మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి మున్సిపల్ సమగ్ర అభివృద్ధి కోసం ఇప్పటికే 15 కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. ప్రతి వార్డు పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల కోసం వీటిని కేటాయించినట్లు పేర్కొన్నారు.

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాబోయే ఐదు సంవత్సరాలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. రాబోయే వేసవికాలం దృష్టిలో పెట్టుకొని మంచినీరు, విద్యుత్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి వార్డుని అభివృద్ధి పతంలో ముందుకు తీసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాధవి రెడ్డి, కమిషనర్ వెంకట కిషన్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.