16 April, 2026 | 10:08 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

ప్రజల సౌకర్యార్థం 5 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు

17-11-2025 10:24 PM

జాతీయ రహదారి విస్తరణ పనులపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు: మదినగూడ నుండి సంగారెడ్డి వరకు చేపడుతున్న జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ప్రజల సౌకర్యార్థం పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం డివిజన్, పటాన్ చెరు డివిజన్లో పరిధిలో ఐదు ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టబోతున్నట్లు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం జాతీయ రహదారణ సంస్థ, పోలీసు, ట్రాఫిక్ శాఖల అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో కలిసి ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించబోయే స్థలాలలో ఎమ్మెల్యే జిఎంఆర్ క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బిహెచ్ఎల్ చౌరస్తా నుండి పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు వరకు ప్రతిరోజు నిత్యం వేలాది మంది ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం రహదారిని దాటుతూ ఉంటారని తెలిపారు.

ఈ నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకుగాను ఐదు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించబోతున్నట్లు తెలిపారు. రామచంద్రపురం డివిజన్ పరిధిలోని అశోక్ నగర్,. బీరంగూడ ఐటిఐ,. రామచంద్రపురం రైల్వే లైను, పటాన్చెరు బస్టాండ్, పటాన్చెరు సాకి చెరువు సమీపంలో వీటిని నిర్మించబోతున్నట్లు తెలిపారు.  విశాలమైన విస్తీర్ణంతో, లిఫ్ట్ సౌకర్యంతో వీటిని నిర్మించబోతున్నట్లు తెలిపారు. నిర్దేశించిన గడువులోగా రహదారి విస్తరణ పనులు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని.. ప్రమాణాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాతీయ రహదారుల సంస్థ డి ఈ రామకృష్ణ, డిఎస్పి ప్రభాకర్, సిఐలు వినాయక్ రెడ్డి, లాలు నాయక్, ఎక్సైసీఐ పరమేశ్వర్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు శాస్త్రి, రమేష్, తదితరులు పాల్గొన్నారు.