17-11-2025 10:21:42 PM
తూప్రాన్ (విజయక్రాంతి): తూప్రాన్ పోలీస్ డివిజన్ కార్యాలయంలో డీఎస్పీ నరేందర్ గౌడ్ రికార్డులను పరిశీలించారు. గత ఆరు నెలలుగా నమోదైన క్రైమ్ కేసులను వివిధ రకాల సాధారణ కేసులను సీసీ కెమెరాల పర్యవేక్షణను పరిశీలించారు. అనంతరం ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని పరిష్కరించాల్సిందిగా సూచన ప్రాయంగా తెలిపారు. ఇందులో సీఐ రంగాకృష్ణ, ఎస్ఐ శివానందం ఉన్నారు.