calender_icon.png 18 November, 2025 | 12:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

37 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

17-11-2025 10:26:25 PM

జిన్నారం/అమీన్ పూర్: బొల్లారం, జ్యోతినగర్ ప్రాంతంలో అక్రమంగా ప్రభుత్వ రేషన్ బియ్యం తరలిస్తున్న ఘటన బయటపడింది. స్థానిక అధికారులకు లభించిన సమాచారం మేరకు నిర్వహించిన దాడిలో 80 బస్తాలు సుమారు 37 క్వింటాళ్లు రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటోను అధికారులు అడ్డుకుని సీజ్ చేశారు. ఈ ఘటనలో డ్రైవర్ రాజు, ఆటో యజమాని జైపాల్‌తో పాటు అక్రమంగా రేషన్ బియ్యం విక్రయించిన రేషన్ డీలర్ అలివేలమ్మపై కూడా చర్యలు తీసుకున్నారు. డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లై అనిల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.