calender_icon.png 3 February, 2026 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరికి అండగా ప్రజాపాలన ప్రభుత్వం

03-02-2026 02:11:06 AM

కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ 

అడ్డాకుల ఫిబ్రవరి 2: రాష్ట్ర ప్రభుత్వం పేదింటి అడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు రెండు మూడు నెలల్లోనే పార్టీలకు అతీతంగా అందిస్తున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. సోమవారం అడ్డాకుల మండల కేంద్రంలోని రైతు వేదిక సమావేశంలో మండలానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు, ఇందిరమ్మ ఇండ్ల ప్రొస్టింగ్ ఎమ్మెల్యే అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం మహిళలు ప్రతిష్టాత్మకంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు.

అదేవిధంగా అడ్డాకల మహిళలకు సమైక్య మహిళ సంఘం ద్వారా పెట్రోల్ బంకు త్వరలోనే ఏర్పాటు చేయడానికి భూ సేకరణ చేస్తున్నామన్నారు. ప్రతి మహిళలు మహిళ సంఘాల్లో 18 ఏళ్లు నుండి 60 ఏళ్ల వరకు ఉన్న మహిళలు ప్రతి ఒక్కరు గ్రూపులో ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తోట శ్రీహరి, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ మోహన్ రెడ్డి, మాజీ ఎంపీపీ నాగార్జున రెడ్డి, సర్పంచ్ దశరథరెడ్డి, రాచాల సర్పంచి రాజు, సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ, శేఖర్ రెడ్డి, హేమవర్ధన్ రెడ్డి, వేగనాద్, రమేష్ కాంగ్రెస్ నాయకులు తదురులు పాల్గొన్నారు.