22 June, 2026 | 6:08 PM

చలో హైదరాబాద్ పోస్టర్ల ఆవిష్కరణ

22-06-2026 04:57 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని విశ్వేశ్వరయ్య భవన్ నందు ఈనెల 26వ తేదీన హైదరాబాద్ ఎల్బీనగర్ కామినేని చౌరస్తా స్వకుల శాలి సమాజ భవనంలో నిర్వహించే పద్మశాలి ఉద్యోగుల రాష్ట్ర సదస్సు గోడ ప్రతులను నిర్మల్ జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బూర ఉమా శంకర్ మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలోని పద్మశాలి ఉద్యోగులందరూ పాల్గొని సదస్సు ను విజయవంతం చేయాలని కోరారు.