5 March, 2026 | 5:16 PM

Breaking News

నిబద్ధత కలిగిన మార్సిస్టు కార్యకర్త కామ్రేడ్ సింగపంగా ముత్తమ్మ   •   సైనిక స్కూల్ ఎంట్రన్స్ పరీక్షా ఫలితాల్లో... క్రాంతి కీన్ అకాడమీ సత్తా.   •   కరెంట్ తగిలి రైతుమృతి   •   రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి   •   మాచన రఘునందన్‌కు డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు   •   ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకున్న కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్   •   సిఎస్ఆర్ నిధులను నిర్వాసిత గ్రామాల అభివృద్ధికి వెచ్చించాలి   •   ఆర్ట్స్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం   •   శివాజీ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి   •   పరీక్షలు అంటే భయం వీడాలి   •  

ప్రజావాణి సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

03-02-2026 02:10 AM

హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ 

హనుమకొండ టౌన్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అందిన వినతులను సత్వరమే పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులకు హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, జిల్లా రెవెన్యూ అధికారి వై.వి గణేష్ లతో కలిసి ప్రజల నుండి వినతులను స్వీకరించారు.

ప్రజావాణిలో రెవెన్యూ, హౌసింగ్, విద్యుత్, పౌరసపరాలు, వైద్య ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం తదితర శాఖలకు సంబంధించిన మొత్తం 91 విన్నతులు అందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖలు సీరియస్ గా పరిగణించి పక్షం రోజుల్లో గా పరిష్కరించాలని, శాఖల వారీగా సమీక్ష నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేష్ ను ఆదేశించారు.

పదవ తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో మండలాల ప్రత్యేక అధికారులు తమ పరిధిలోని ఉన్నత పాఠశాలలో, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, హాస్టలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు పరిశీలించాలని, ప్రత్యేక శిక్షణ తరగతుల నిర్వాణ, విద్యార్థుల హాజరు ఉపాధ్యాయుల, అధ్యాపకులు పనితీరు తదితర నివేదిక అందజేయాలని అన్నారు.

స్టూడెంట్ వెల్నెస్ కార్యక్రమం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అలాగే పెండింగ్లో ఉన్న ఆర్టీఐ ఫిర్యాదుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ సంబంధిత శాఖల పిఐఓలతో, డిఆర్‌ఓ ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ ఆర్డిఓ రాథోడ్ రమేష్, డిఆర్డిఓ మేన శ్రీను, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.