4 July, 2026 | 9:52 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జీఎస్సార్

30-06-2025 12:28 AM

జయశంకర్ భూపాలపల్లి/ మహబూబాబాద్, జూన్ 29 (విజయక్రాంతి) భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు  గణపురం మండలం బుద్ధారం గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న అంగన్వాడీ భవనాలకు అవసరమైన స్థలాలను ఈడబ్ల్యూఐడీసీ డీఈ రామకృష్ణ, ఏఈ జీవన్ కుమార్, గ్రామ నాయకులతో కలిసి పరిశీలించారు.

అదే విధంగా పాఠశాల ప్రహారీ గోడ పునరుద్ధరణ పనులు, పాఠశాల ప్రాంగణంలో ఓపెన్ జిమ్, సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు విద్యార్థులకు ఇతర మౌలిక వసతుల కల్పనల కొరకు అధికారులతో చర్చించారు. ఆయా పనులకు త్వరితగతిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.

త్వరలోనే అన్ని పనులను ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కోరారు. బుద్ధారం గ్రామ బస్టాండు సెంటర్లో కొడవటంచ వెళ్లే దారిలో కొత్తగా నిర్మించనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆర్చి పనులకు సంబంధించి అధికారులతో చర్చించారు.