ముమ్మరంగా ఎన్నికల ప్రచారం
09-05-2024 02:33 AM
కుమ్రంభీం ఆసిఫాబాద్, మే 8 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులే కాకుండా ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకు లు తెల్లవారితే చాలు ఓటర్ల వద్ద వాలిపోతున్నారు. ఉపాధి హామీ కూలీలు, మార్నింగ్ వాకర్స్, ఉద్యోగులను కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. బుధవారం దహెగాం మండలంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి గొడం నగేష్, ఎమ్మెల్యే హరీశ్ బాబు ప్రచారం నిర్వహించారు. రెబ్బెన మండలంలో బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుని గెలిపించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రచారం చేశారు. ఎమ్మెల్సీ దండె విఠల్, ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు కాగజ్ నగర్‌లో పర్యటించారు. ఆసిఫాబాద్‌లో బీజేపీ సీనియర్ నాయకుడు అరిగెల నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.






