నీలం మధుకు మద్దతుగా ప్రచారం
09-05-2024 02:32 AM
పటాన్‌చెరు, మే 8: మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు కు మద్దతుగా సీపీఎం నాయకులు ప్రచారం చేపట్టారు. బుధవారం పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ చౌరస్తాలో సీపీఎం నాయకులు రాజయ్య, నాగేశ్వర్‌రావు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరిగారు. వ్యాపారస్తుల వద్దకు వెళ్లి కాంగ్రెస్‌కు ఓటేయాలని, మధును భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.






