కాసేపట్లో గవర్నర్ ను కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి
19-04-2026 10:27 AM
హైదరాబాద్: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలువనున్నారు. ఈ భేటీలో ఇద్దరు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ ఆచార్య కోదండరామ్, అజారుద్దీన్ పేర్లు ఆమోదించాలని కోరనున్నట్లు సమాచారం. ఏ సభలో సభ్యుడు కానప్పటికీ మంత్రిగా కొనసాగుతున్న అజారుద్దీన్ ఈ నెలాఖరుకు ఆయన మంత్రి పదవి చేపట్టి ఆరు నెలలు పూర్తవుతుంది. ఆరు నెలల్లోపు ఏదొక సభలో సభ్యుడిగా కావాల్సి ఉన్న అజారుద్దీన్ ఎమ్మెల్సీని గవర్నర్ ఆమోదించకుంటే ఏప్రిల్ 30 తర్వాత పదవి కోల్పోనున్నారు. ఈ సమావేశం తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీ నియామకాల విషయంలో కీలక మలుపు కానుంది.






