25 June, 2026 | 8:13 AM

విద్యార్థులకు అండగా ఎమ్మెల్యే..

14-06-2024 01:34 AM
  • పుట్టిన రోజున అందిన నోట్‌బుక్స్, పెన్నులు కలెక్టర్‌కు అందజేత

 కరీంనగర్, జూన్ 13(విజయక్రాంతి): పేద విద్యార్థులకు అండగా ఉండాలనే ఆలోచనతో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 5న ఆయన పుట్టిన రోజు సందర్భంగా తన దగ్గరకు వచ్చే వారు కేవలం నోట్‌బుక్స్, పెన్నులు తీసుకురావాలని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే అభిమానులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఎమ్మెల్యేకు వేలాది రూపాయల విలువగల నోట్‌బుక్స్, పెన్నులు బహుకరించారు. వాటిని పేద విద్యార్థులకు అందజే యాలనే సంకల్పంతో గురువారం కలెక్టర్ పమేలా సత్పతికి ఎమ్మెల్యే అందజేశారు. డీఈవో జనార్దన్‌రావు పాల్గొన్నారు. 

పుస్తకాల పంపిణీ  

పెద్దపల్లి/మంథని: ఎలిగేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు కిట్స్‌ఫర్ కిడ్స్ ఇండియా ఎన్డీవో వారి సహకారంతో అర్షనపల్లి యువి నేతృత్వంలో నోట్‌బుక్స్‌ను, స్కూల్ బ్యాగులను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు పంపిణీ చేశారు.