25 June, 2026 | 7:11 AM

వ్యక్తిపై చిరుత దాడి

14-06-2024 01:36 AM

వికారాబాద్, జూన్ 13( విజయక్రాంతి) : బహిర్భూమికి వెళ్లిన ఓ వ్యక్తిపై చిరుత దాడిచేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. చౌడాపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పెంటల శేఖర్ గురువారం రాత్రి 11 గంటల సమయంలో గ్రామంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల సమీపంలో బహిర్భూమికి వెళ్లాడు. అదే సమయంలో శేఖర్‌పై చిరుతపులి దాడి చేసింది. దీంతో శేఖర్ పెద్దగా అరుస్తూ పరిగెత్తాడు. చిరుత దాడి నుండి తప్పించుకొని చిన్న గాయాలతో బయటపడ్డాడు. శేఖర్‌పై దాడి చేసిన చిరుత పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. శేఖర్‌పై చిరుత దాడితో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. దాడి చేసింది చిరుతనా? ఇంకేదైనా అటవి జంతువా? అనే విషయంపై అటవీశాఖ అధికారులు విచారణ చేస్తున్నారు.