6 July, 2026 | 9:42 PM

Breaking News

చంద్రపురి డివిజన్‌లో సర్ కార్యక్రమంపై ఇంటింటి ప్రచారం   •   గిరిజన దర్బార్ లో గిరిజనులు అందించిన ప్రతి విన్నపాన్ని సత్వరమే పరిష్కరించాలి   •   శివంపేట గ్రామానికి నిధుల మంజూరుపై హర్షం!   •   ప్రమాద బాధిత కుటుంబాలకు వసుధ ఫౌండేషన్ చేయూత   •   ముత్తారం ఎంపీడీవోగా ప్రవీణ్ కుమార్ నియామకం   •   భిక్కనూరులో అక్రమ నిర్మాణాలపై ప్రజావాణిలో ఫిర్యాదు   •   తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ పనుల పరిశీలన   •   ముమ్మరంగా ఎస్‌ఐఆర్ కార్యక్రమం   •   మల్లెలమడుగు గ్రామ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు సీపీఎం వినతిపత్రం   •   బీజేపీ జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా పసునూరి తిరుపతి   •  

కోయగూడెం ఓపెన్ కాస్ట్ టిప్పర్, లారీ ఓనర్స్ యూనియన్ ఆఫీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే

03-04-2025 11:59 AM

టేకులపల్లి, (విజయక్రాంతి): సింగరేణి కోయగూడెం ఓపెన్ కాస్ట్  టిప్పర్స్, లారీ ఓనర్స్ యూనియన్  కార్యాలయాన్ని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య(Yellandu MLA Koram Kanakaiah) గురువారం ప్రారంభించారు. టేకులపల్లి మండల కేంద్రం నుంచి బోడు గ్రామానికి వెళ్లే మార్గంలోని  సుకాలబోడు స్టేజీ సమీపంలో లారీ కార్యాలయం, లారీలు నిలుపుకునేందుకు యార్డును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముందుగా టేకులపల్లి ప్రధాన రహదారి మీదుగా, బోడు రోడ్ సెంటర్కు ఊరేగింపుగా చేరుకొని  బానసంచాలు కాల్చారు.

ర్యాలీ ప్రదర్శనలో ఎమ్మెల్యే  పాల్గొని యూనియన్ కార్యాలయాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యేని  కోయగూడెం ఓపెన్ కాస్ట్  టిప్పర్స్, లారీ ఓనర్స్ యూనియన్ నాయకులూ  ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోయగూడెం ఓపెన్ కాస్ట్  టిప్పర్స్, లారీ ఓనర్స్ యూనియన్ అధ్యక్షులు నేలవెల్లి నర్సింహారావు, గౌరవ అధ్యక్షులు కోరం సురేందర్, ఉపాధ్యక్షులు బోడ మంగీలాల్, ఇల్లందు డిఎస్పీ చంద్ర భాను, టేకులపల్లి ఎస్సై పోగుల సురేష్, యూనియన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈది గణేష్, చిట్టి బాబు, మోకాళ్ళ పోషాలు, ఇస్లావత్ రెడ్యానాయక్, బానోత్ రవి, లక్ష్మయ్య, ముచ్చా సుధాకర్, ధర్మయ్య, తదితర నాయకులు  పాల్గొన్నారు.