మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
09-04-2026 02:21 PM
మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలో గురువారం మార్కెట్ కమిటీ వద్ద మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు.దీనికి సహకరించిన మంత్రి తుమ్మల నాగేశ్వరావు అడ్లూరి లక్ష్మణ్ లకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.రైతు దాళారుల బారిన పడకుండా ఈ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో చిట్యాల లక్ష్మణ్,మండల నాయకులు వివిధ గ్రామాల సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.




