calender_icon.png 26 September, 2025 | 4:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికార పార్టీలో ఉన్నప్పటికీ ప్రజల పక్షాన పోరాడుతా...

26-09-2025 03:14:24 PM

పార్టీలకు అతీతంగా త్రిబుల్ ఆర్ భూ నిర్వాసితులకు న్యాయం చేకూరుస్తా

దక్షిణ భాగంలో వెళ్తున్న త్రిబుల్ ఆర్ రహదారి నియోజకవర్గ ఎమ్మెల్యేలతో చర్చిస్తా

భూమి కి భూమి ఇవ్వాలనేది మా నినాదం..... భూ నిర్వాసితుల డిమాండ్

దుర్గామాతకు ప్రత్యేక పూజలు,పెట్రోల్ బంక్ ప్రారంభం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి 

మునుగోడు,(విజయకాంతి): త్రిబుల్ ఆర్ దక్షిణ భాగం రహదారి కింద మునుగోడు నియోజకవర్గంలో భూములు కోల్పోతున్న రైతుల పట్ల అధికార పార్టీలో ఉన్నప్పటికీ ప్రజల పక్షాన పోరాడుతానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy ) స్పష్టం చేశారు. శుక్ర వారం చౌటుప్పల్ పట్టణం, చౌటుప్పల్ మండలం, నారాయణ్ పూర్ మండలం, గట్టుప్పల్ మండలం, మర్రిగూడెం మాడలాలకు చెందిన భూ నిర్వాసితులు మునుగోడు లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి వినతి అందజేశారు.దక్షిణ భాగంలో అలైన్మెంట్ను మార్చారని, దివిస్ కంపెనీ కి లాభం చేకూరేలా రైతుల పొట్ట కొడుతున్నారని ఎమ్మెల్యేకు భూ నిర్వాసితులు తెలిపారు. భూమిపో తే జీవనమే పోతుందని మాకు న్యాయం చేయాలని కోరుతూ భూమికి భూమి ఇవ్వడమే మా నినాదమని భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. భూమి కోల్పోతున్న బాధలో మీరు పడుతున్న ఆవేదనకు మీరు చేస్తున్న డిమాండ్లతో నేను ఏకీభవిస్తున్న ఎమ్మెల్యే మాట్లాడారు.

భూమికి రైతుకు మధ్య  బావోద్వేగ బంధం ఉంటుందని,ఇది చాలా సున్నితమైన సమస్య అని అన్నారు.పార్టీ కంటే, ప్రభుత్వం కంటే ప్రజలే ముఖ్యం అనే బావనతో ఆలోచన చేస్తున్న అని తెలిపారు.భూ నిర్వాసితులకు న్యాయం చేయడానికి త్రిబుల్ ఆర్ దక్షిణ భాగం రహదారి వెళ్తున్న నియోజకవర్గాల శాసనసభ్యులతో  మాట్లాడుతున్న ఈ విషయంలో అందరు ఎమ్మెల్యే లు ఆవేదనతో వున్నారు.సగం మునుగోడు నియోజకవర్గం త్రిబుల్ ఆర్  లో కలుస్తుంది .అలైన్ మెంటు మార్చడానికి కారణాలను రైతులకు వివరించి ఒప్పించి నిర్ణయం తీసుకోవాలి అని అన్నారు.

ప్రతిపక్షాలు మిమ్మల్ని తప్పుతోవ పట్టిస్తున్నాయి,మీకు న్యాయం చేసేవారి వైపు, మీకోసం కొట్లాడే వారి వైపు ఉండండి ,2017 లో శివన్నగూడెం ప్రాజెక్టు ను ప్రారంభించారు. పరిహారం మాత్రం 2023 లో నేను రాజీనామా చేసిన తరువాత పూర్తి చేశారు అని గుర్తు చేశారు. త్రిబుల్ ఆర్ వెళ్లే నియోజకవర్గ ఎమ్మెల్యే లం అందరం కలిసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతాం భూ నిర్వాసితులకు ఎన్ని పార్టీలు అయినా ఉండని, మీకు నాయ్యం చేయడానికే ప్రయత్నం చేస్తున్న అని తెలిపారు.చౌటుప్పల్ వరకు వచ్చేసరికి RRR అలైన్ మెంట్ దగ్గరికి తీసుకొచ్చారు.ఉత్తర భాగం లోనే అలైన్ మెంట్ విషయంలో తప్పు జరిగింది.. ఇపుడు దక్షిణ భాగంలో తప్పు ను కొనసాగిస్తున్నారు అని అన్నారు.

దుర్గ మాతకు ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

మునుగోడు పట్టణంలోని కనకదుర్గ ఆలయ ఆవరణలో  దుర్గామాత శరన్నవరాత్రి  మండపాన్ని దర్శించుకుని దుర్గామాతకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. దుర్గామాత ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండే విధంగా వరం ఇవ్వాలని కోరారు

మండలంలోని చలమన గ్రామంలో పెట్రోల్ బంకును ప్రారంభించిన ఎమ్మెల్యే..

మునుగోడు మండలం చల్మెడ గ్రామంలో  నూతనంగా నిర్మించిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకును ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.