calender_icon.png 26 September, 2025 | 4:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ వలలో గచ్చిబౌలి లైన్‌మ్యాన్

26-09-2025 03:25:20 PM

హైదరాబాద్: తెలంగాణలో ఎక్కడో అక్కడ అవినీతి అధికారులు ఏసీబీ అధికారుల(ACB officials) వలకు చిక్కుతున్నారు. తాజాగా గచ్చిబౌలిలో పనిచేస్తున్న టీజీఎస్పీడీసీఎల్(Telangana State Southern Power Distribution Company Limited) జూనియర్ లైన్‌మ్యాన్ శ్రీకాంత్ గౌడ్, అధికారిక అనుకూలంగా వ్యవహరించినందుకు ఫిర్యాదుదారుడి నుండి రూ.30,000 డిమాండ్ చేసి, రూ.11,000 లంచం తీసుకుంటుండగా తెలంగాణ అవినీతి నిరోధక బ్యూరో (Anti Corruption Bureau) రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. 5 కెవి నుండి 11 కెవి వరకు విద్యుత్ ప్రవాహాన్ని కొనసాగించడానికి ఫిర్యాదుదారుడి ఇంట్లో వైరింగ్ మార్చడానికి, ఫిర్యాదుదారుడి ఇంట్లో విద్యుత్ మీటర్ సీల్ విప్పి సీల్ చేయడానికి లంచం డిమాండ్ చేశారు. లైన్‌మ్యాన్ వద్ద నుండి లంచం మొత్తాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.