26-09-2025 02:46:31 PM
అమరావతి: ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) వ్యాఖ్యలపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని(Ex Minister Perni Nani) విరుచుకుపడ్డారు. కామినేని శ్రీనివాసరావు(Kamineni Srinivasa Rao) విచక్షణ మరిచి మాట్లాడారని పేర్నినాని ఆరోపించారు. నియోజకవర్గం వదిలేసి సినిమాలపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రి పదవి కోసం కామినేని పాకులాడుతున్నారని చెప్పారు. సీఎంతో సమానంగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఉండటంతో బాలకృష్ణ తట్టుకోలేకపోతున్నారని పేర్నినాని విమర్శించారు. అసెంబ్లీలో బ్రీత్ ఎనలైజర్ పెట్టి పరీక్షించాలి, అసలు సైకో బాలకృష్ణ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని పేర్నినాని వెల్లడించారు.
ఇప్పటికైనా చిరంజీవి స్పందించి లేఖ రాశారని చెప్పారు. సినిమా వాళ్లను జగన్ ప్రభుత్వం(Jagan government) గొప్పగా చూసుకుందని వివరించారు. పేదలకు సినిమా అందుబాటులో ఉండాలని జీవోలు తీసుకొచ్చామని వెల్లడించారు. జగన్-చిరంజీవి మధ్య సోదరభావం ఉందని పేర్ని స్పష్టం చేశారు. రాజకీయాలకు, పార్టీ ప్రచారానికి సినిమావాళ్లను చంద్రబాబు వాడుకున్నారని ద్వజమెత్తారు. అటు బాలకృష్ణపై చిరంజీవి(Chiranjeevi ) అభిమాన సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలకృష్ణ వాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొంది. అసెంబ్లీలో చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ వ్యంగ్యంగా మాట్లాడడం సరికాదని హెచ్చరించింది. బాలకృష్ణ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం డిమాండ్ చేస్తోంది.