26-09-2025 03:09:34 PM
సనత్‌నగర్,(విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతిని తెలిపేలా నిర్వహించే అలయ్ బలయ్(Alai Balai program) కార్యక్రమానికి మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani Srinivas Yadav ) ను నిర్వాహకులు ఆహ్వానించారు. శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను అలయ్ బలయ్ చైర్ పర్సన్ బండారు విజయలక్ష్మి కలిసి అక్టోబర్ 3 వ తేదీన నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరుకావాలని కోరుతూ ఆహ్వానం అందజేశారు. ప్రస్తుత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రారంభించిన అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఆమె కుమార్తె బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తున్నారు. తెలంగాణ కళలు, వంటకాలు, సాంప్రదాయాలను తెలిజెప్పే విధంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తుండటం పట్ల ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆమెను అభినందించారు.