calender_icon.png 26 September, 2025 | 4:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గొర్రెల యూనిట్ల పంపిణీ పథకం కొనసాగించాలి

26-09-2025 03:02:32 PM

గొర్రెల మేకల పెంపకదారుల సంఘం జిల్లా అధ్యక్షులు సాగర్ల మల్లేష్ 

చండూరు,(విజయక్రాంతి): గొర్రెల యూనిట్ల పంపిణీ పథకం కొనసాగించాలని గొర్రెల మేకల పెంపకదారుల సంఘం జిల్లా అధ్యక్షులు సాగర్ల మల్లేష్ అన్నారు. శుక్రవారం గట్టుప్పల మండల కేంద్రంలో గొర్రెల మేకల పెంపకం దారుల మండల మహాసభ అచ్చిన శ్రీను అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డీడీలు కట్టి పెండింగ్లో ఉన్నటువంటి గొర్రెల పెంపకం దారులకు వెంటనే గొర్రెలు పంపిణీ చేయాలని, ఫ్రీజింగ్ చేసిన పెంపకం దారుల బ్యాక్ అకౌంట్ ల ను ప్రీజింగ్ ఎత్తివేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాదంలో చనిపోయిన గొర్రెల కాపరుల కుటుంబాలకు పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని, జీవాలకు ఇన్సూరెన్స్ పథకానికి కొనసాగించాలని ఆయన అన్నారు.

559, 10,16 జీవోలను అమలు చేయాలని, ఫారెస్ట్ భూములలో జీవాలను మేపకుండా వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. సంవత్సరానికి నాలుగు దపాలుగా నట్టల మందులు త్రాపించడంతోపాటు, సీజన్లో వచ్చే అన్ని రకాల వ్యాధులకు మందల వద్దనే వ్యాక్సిన్ వేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పశువుల దవఖానలో డాక్టర్ల   పోస్టులను  భర్తీ చేయాలని,  నిరుద్యోగ యువతీ యువకులకు  సబ్సిడీ రుణాలు అందజేయాలని ఆయన అన్నారు. గొర్రెల మేకల పెంపకం దారుల ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్తులో పోరాటాలకు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈనెల 30న మునుగోడు మండల కేంద్రంలో గొర్రెల మేకల పెంపకం దారుల జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని, అన్ని మండలాలనుండి అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన అన్నారు.అనంతరం గొర్రెల మేకల పెంపకదారుల  సొసైటీ అధ్యక్షుడుని కొండే సత్తయ్యను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వృత్తి సంఘాల రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం, కర్నాటి మల్లేశం, చాపల మారయ్య, జెర్రి పోతుల ధనంజయ, కర్నాటి సుధాకర్, కర్నాటి వెంకటేశం, ముసుకు బుచ్చిరెడ్డి, బండ నరేందర్, సుర్గి యాదయ్య, రావుల వెంకటయ్య, మందుల శంకరయ్య, కుందే రాజు తదితరులు పాల్గొన్నారు.