26-09-2025 02:37:10 PM
మధ్యాహ్నం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం(Bhadrachalam) వద్ద గోదావరి నది(Godavari River ) పొంగి ప్రవహిస్తున్నది. దీంతో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరిక అయిన 43 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీచేశారు. దీంతో క్రింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశారు. భద్రాచలం ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు వలన గోదావరి ,నీటిమట్టం పెరుగుతున్నది. ఈ సందర్భంగా భద్రాచలం నుండి దిగుకు 9,41,704 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తున్నది. భద్రాచలం లకు ఎగువన గల పేరూరు వద్ద 16. 400 మీటర్లలో గోదావరి ప్రవాహం ఉన్నందున భద్రాచలం వద్ద మరింత పెరిగే అవకాశం ఉంది.