calender_icon.png 26 September, 2025 | 4:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోన్ మాట్లాడుతూ.. భవనం పైనుంచి పడి లేబర్ మృతి

26-09-2025 03:00:08 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): పోచారం ఐటీ కారిడార్(Pocharam IT Corridor) పోలీస్ స్టేషన్ పరిధి వెంకటాపూర్ లోని అనురాగ్ యూనివర్సిటీలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ మీద నుంచి పడి దేవదాస్ బంజారే (20) అనే లేబర్ మృతి చెందాడు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం రాజ్ నందు గావ్ కు చెందిన దేవదాస్ అనురాగ్ యూనివర్సిటీలో నూతన నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ లో లేబర్ గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి 8.15 గంటల ప్రాంతంలో ఫోన్ మాట్లాడుకుంటూ నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పైకి వెళ్ళి ప్రమాదశాత్తు బిల్డింగ్ పై నుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం  దేవదాసుని గుర్తించిన తోటి పనివాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఫోన్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు పడ్డడా లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.