26-09-2025 03:04:45 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని కాంట ప్రాంతంలో కేటాయించబడ్డ ఆటో యూనియన్ స్థలంలో నుండి పాత సిఎస్పి వద్ద ఏర్పాటు చేసే ఫ్రూట్ మార్కెట్ కు మున్సిపల్ అధికారులు దారి తీసే ప్రయత్నాలు విరమించుకోవాలని కోరుతూ శుక్రవారం రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు(Minister Ponnam Prabhakar) బెల్లంపల్లి ఆటో యూనియన్ అధ్యక్షులు కట్టా రాంకుమార్ ఆధ్వర్యంలో ఆటో యూనియన్ సభ్యులు వినతి పత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని పరిశీలించి ఆటో యూనియన్ సభ్యులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చారు.