calender_icon.png 21 January, 2026 | 5:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలి

21-01-2026 04:06:59 PM

బీసీ జాక్ రాష్ట్ర చైర్మన్ తిరునహరి శేషు

హనుమకొండ,(విజయక్రాంతి): ఉస్మానియా విశ్వవిద్యాలయం టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రొఫెసర్ మనోహర్ పై విశ్వవిద్యాలయ అధికారులు విధించిన సస్పెన్షన్ ను వెంటనే ఎత్తివేయాలని బీసీ జాక్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు ముఖ్యమంత్రిని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. కెరీర్ అడ్వాన్స్ మెంట్ స్కీం లో విశ్వవిద్యాలయంలో పనిచేసే టీచర్స్ కి అన్యాయం జరిగిందని, ప్రజాస్వామ్య యుతంగా నిరసన తెలియజేసినందుకు విశ్వవిద్యాలయ అధికారులు బలహీన వర్గాలకు చెందిన టీచర్స్ అసోసియేషన్ నాయకుడు ప్రొఫెసర్ మనోహర్ పై సస్పెన్షన్ వేటు వేయటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.

సస్పెన్షన్ తర్వాత ప్రొఫెసర్ మనోహర్ ను విశ్వవిద్యాలయం లోకి రాకుండా అడ్డుకోవడం  వ్యక్తి స్వేచ్ఛను హరించడమేనని, విశ్వవిద్యాలయంలో సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వ అనుమతి కావాలని చెప్పే విశ్వవిద్యాలయ అధికారులు సస్పెన్షన్ విషయంలో ప్రభుత్వ అనుమతి తీసుకున్నారా.. అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని ప్రొఫెసర్ మనోహర్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.