21-02-2026 12:00:00 AM
హాజరైన మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్
సికింద్రాబాద్, ఫిబ్రవరి 20 (విజయ క్రాంతి): కూకట్‌పల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, అన్నా అంటే, నేనున్నానని పలికే మా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అని అన్నారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ వారికి హా ర్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. కూకట్ పల్లి బిఆర్‌ఎస్ కార్మిక నాయకుడు, హనుమాన్ నగర్ అసోసియేషన్ అధ్యక్షుడు సిహెచ్ పోచయ్య ఆధ్వర్యంలో గురువారం రాత్రి కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జన్మదిన వేడుకలు హనుమాన్ నగర్‌లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఓల్డ్ బోయిన్‌పల్లి మాజీ కార్పొ రేటర్ ముద్దం నరసింహ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై హనుమాన్ నగర్ అధ్యక్షు లు పోచయ్య, కాలనీవాసులతో కలిసి ముద్దం నరసింహ యాదవ్ చేతుల మీదు గా కేక్ కట్ చేసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశా రు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ ముద్దం మాట్లాడుతూ నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ, నియోజకవర్గం, రాష్ట్రా భివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సం పూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆకాంక్షించారు.
అనంతరం అధ్యక్షుడు సిహెచ్ పోచయ్య మాట్లా డుతూ ఓల్ బోయిన్‌పల్లి డివిజన్ హస్మత్ పేట్‌లోఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ముద్దం నరసింహ యాదవ్ లు ఎంతో అభివృద్ధి చేశారని తెలియజేశారు. ఈ సంద ర్భంగా మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్‌ను శాలువాతో ఘనం గా సన్మానించారు. ఈ కార్యక్రమం లో హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యు లు, బిఆర్‌ఎస్ నాయకులు, మహిళలు మాధవరం కృష్ణారావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.