21-02-2026 12:00:00 AM
హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
మేడిపల్లి,ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్‌లో సీతా రామాంజనేయ స్వామి విగ్రహ పున ప్రతిష్ట కార్యక్రమం అం గరంగ వైభవంగా నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ వేడుకల్లో మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవ విగ్రహాలతో శోభాయాత్ర నిర్వహించిన అర్చకులు ప్రతిష్ట మూర్తులను పట్టు వస్త్రాలతో అలంకరించి అర్చనలు, అభిషేకాలు, హోమాలు, వంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ పూజల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్,ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.