విజయ తెలంగాణ డైయిరీని ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం, చైర్మన్ గుత్తా
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన విజయ తెలంగాణ డైయిరీని శనివారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(MLA Kumbam Anil Kumar Reddy), చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి(Chairman Gutha Amith Reddy) ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం పాల ఉత్పత్తిదారుల(Milk Producers) సంక్షేమానికి కృషి చేస్తుందని రానున్న రోజుల్లో పాల ఉత్పత్తిలో మరింత అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి, కంకల కిష్టయ్య, కుంభం వెంకట పాపిరెడ్డి, బత్తిని లింగయ్య, బత్తిని సహదేవ్, గరిసె రవి, మత్స్యగిరి గుట్ట చైర్మన్ కొమ్మారెడ్డి నరేష్ రెడ్డి, చెరుకు శివయ్య, బద్దం సంజీవరెడ్డి, పబ్బు సురేందర్, పాలకూర వెంకటేశం, ఉక్కుర్తి స్వామి తదితరులు పాల్గొన్నారు.






