15 April, 2026 | 5:03 PM

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

08-12-2024 03:47 PM

ఇల్లెందు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలంలోని ఆదివారం పలు పంచాయతీల్లో ఎమ్మెల్యే కోరం కనకయ్య విస్తృతంగా పర్యటించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పాత తడికలపూడి, స్టేషన్ తడికలపూడి,  ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు, సులానగర్, చింతలంక, బిల్లుడు తండా,  తొమ్మిదోమైల్ తండా, బేతంపూడి,  సామ్య తండా, బోడు, పాతర్లగడ్డ, బండ వారి గుంపు  గ్రామాల్లో సైడు కాల్వల నిర్మాణం, వాగులపై వంతెనల నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు. ముత్యాలంపాడు గ్రామంలో తన గురువు ఎండి గాలీబ్ ను కలిసి ఆరోగ్య పరిష్టితిని అడిగి తెలుసుకున్నారు. రామచంద్రునిపేట గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేశెట్టి ఖాదర్ బాబు ఇంటి వద్ద తేనీటి విందు స్వీకరించారు. అదే గ్రామంలో మాజీ సర్పంచ్ ఈసాల దేవయ్య సతీమణి పెద్దకర్మ హాజరై కుటుంబాన్ని పరామర్శించారు. మొక్కంపాడు గ్రామంలో సైడ్ కాల్వలకు శంఖుస్థాపన చేశారు.