పెద్ద కిస్తీ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
12-05-2026 12:12 AM
అలంపూర్, మే 11:అలంపూర్ పట్టణలో వెలసిన హాజ్రత్ షా అలీ పహిల్వాన్ ఉర్సు మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.ఈ మేరకు సోమవారం పెద్ద కిస్తీ పోటీలను మత పెద్దలతో కలిసి ఎమ్మెల్యే విజయుడు ప్రారంభించారు. ఈ పోటీలను వీక్షించడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చూసి చూడకుండా పట్టణ ఎస్‌ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పిండి జయరాములు, వైస్ చైర్మన్ విక్రమ్, కాంగ్రెస్ నాయకులు టెలికం అడ్వైజరి కమిటీ మాజీ సభ్యులు ఇస్మాయిల్, శేఖర్ రెడ్డి,మత పెద్దలు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు






