సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
03-03-2026 12:30 AM
ఎమ్మెల్యే విజయుడు
అలంపూర్ మార్చి 2 అర్హులైన ప్రతి ఒక్కరు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే విజయు డు అన్నారు. కర్నూలులోని క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి ద్వారా మం జూరైన ఎల్వోసీలను సోమవారం లబ్ధిదారులకు అందజేశారు. ఐజ మండలం యాప దిన్నెకు చెందిన తిమ్మారెడ్డి గారి రంగారెడ్డికి చికిత్స నిమిత్తం రూ .5 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.




