calender_icon.png 9 September, 2025 | 1:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన

05-09-2025 12:49:50 AM

నిర్మల్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): దిలావర్ పూర్ మండలం సాంగ్వీ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. దిలావర్ పూర్ మండల సాం గ్వి గ్రామం నుండి సొన్ మండలం సిద్ధలకుంట గ్రామం వరకు రూ.3 కోట్ల నిధులతో బిటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం సాంగ్వి గ్రామంలో రూ. 20 లక్షల నిధులతో నూతన PHC హెల్త్ సబ్ సెంటర్ ఏర్పాటుకు భూమి పూజ చేసారు. గ్రామంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో సీసీ రోడ్లు డ్రైనేజ్ లు నిర్మాణం చేసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ నిర్మల్ మండల పరిషత్ అధ్యక్షులు వి సత్యనారాయ ణ గౌడ్, తాజా మాజీ జడ్పీటీసీ తక్కల రమణ రెడ్డి, నాయకులు ముత్యం రెడ్డి, సత్యం చంద్రకాంత్, అచ్యుత్ రావ్,  వీరేష్, మండల అధ్యక్షులు నర్సారెడ్డి, నాయకులు జమాల్, మల్లేష్,ముత్యం, అశ్వత్థామ, రాజేశ్వర్, విజ య్‌తో పాటు  మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు, అధికారులు  పాల్గొన్నారు.

అనంతరం అదే మండలంలో ప్రభుత్వ నిధులతో చేపట్టి సిసి రోడ్లు మురికి కాలువల నిర్మాణం మట్టి రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ నల్ల ఇంద్రకన్ రెడ్డి పార్టీ నాయకులు పాల్గొన్నారు.