calender_icon.png 9 September, 2025 | 6:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వాలు అందించే సహాయం గిరిజనులకు అందేలా కృషి చేయాలి

05-09-2025 12:49:56 AM

కలెక్టర్ జితేష్ వి పాటిల్

భద్రాచలం, సెప్టెంబర్ 4, (విజయక్రాంతి): గిరిజన ప్రజలు నిరాశ చెంద కుండా తెలంగాణ మరియు కేంద్ర ప్రభు త్వం ద్వారా విడుదలయ్యే సంక్షేమ పథకాలు నేరుగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడానికి మండల్ లెవెల్ కమిటీ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జి ల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు.

గురువారం సాయంత్రం భద్రాచలం ఐటీడీ ఏ సమావేశం మందిరంలో మండల్ లెవెల్ బ్లాక్ లెవెల్ మాస్టర్ శిక్షకులతో ఆది కర్మయోగి అభియాన్ పథకం విజయవంతంగా నిర్వహించడానికి అందించిన మూడు రోజు ల శిక్షణ శిబిరం ముగింపు సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ మూడు రోజుల శిక్షణలో జిల్లా లేవల్ కమిటీ శిక్షకులు అందించిన ప్ర తి అంశాన్ని క్లుప్తంగా అర్థం చేసుకున్నట్లు నాకు అవగతమైందని, ఇదే స్ఫూర్తితో ముం దుగా గిరిజన గ్రామాలకు సందర్శించినప్పుడు గ్రామములో గ్రామ సభ ఏర్పాటు చేసి పథకాలకు సంబంధించిన అన్ని అంశాలను ప్రత్యేకంగా ఒక బోర్డుపై వ్రాయించి, ప్రజలకు ముందుగా వారికి అర్థమయ్యే రీతి లో బోధన, ప్రజలు ఆలోచించేలా ప్రోత్సహించాలని అన్నారు.

గిరిజన ప్రజలకు వారి తాత ముత్తాతల నాటి పద్ధతులు ఎలా ఉన్నా యో అవి పూర్తిస్థాయిలో వారికి తెలియజేసి, ఇప్పుడు ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు గురించి అవగాహన కల్పించి వారు తీసుకునేలా చూడాలని అన్నారు. ఈ గ్రామంలో ఒ క్కొక్క శాఖకు ఎన్జీవో సాథిలను నియమించినందున వారి ద్వారా గిరిజన ప్రజలకు అర్థమయ్యేలా వారి భాషలోనే తెలియజేయాలని అన్నారు.

ముఖ్యంగా ఆదివాసి గిరి జనుల ఇలవేల్పులతో పాటు ప్రకృతి పరం గా చెట్లు నాటించేలా చూడాలని, మునగ చె ట్లు, ఇప్పపువ్వు చెట్లు, ఇతర పాల సహాయాలకు సంబంధించిన చెట్లను నాటించడంతో పాటు వాటి లాభాల గురించి పూర్తిగా అవ గాహన కల్పించాలని అన్నారు. ప్రతి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాల గురిం చి గ్రామస్తులు చర్చించుకొని పథకాలు లబ్ధి పొందేలా చూడాలని అన్నారు.

అనంతరం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ మా ట్లాడుతూ గిరిజన గ్రామాలలో అనేక రకాల వనరులు అందుబాటులో ఉన్నాయని, ఆ వ నరులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకా లు వారి దరికి చేరేలా చూడాలని, గ్రామాలలో ఉత్సాహవంతులైన యూత్ మరియు పెద్దలకు క్లుప్తంగా తెలియజేస్తే గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఈ పథకాల గురించే చర్చించుకొని లబ్ధి పొందుతారని, మంచి ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమం ముందుకు పోయే లా చూడాలని అన్నారు.అనంతరం మూడు రోజుల శిక్షణ తీసుకున్న బ్లాక్ లెవెల్ మండ ల్ లెవెల్ కమిటీలకు ప్రతిజ్ఞ చేయించారు.

ఆది కర్మయోగి అయిన నేను భద్రాద్రి రామ య్య సాక్షిగా ఆదివాసుల అభ్యున్నతి కోసం నిస్వార్ధంగా అంకితభావంతో నిరంతరం పా టు పడతానని మనస్పూర్తిగా సేవా దృక్పథంతో ఎన్ని అడ్డంకులు వచ్చినా నిరాశ చెం దకుండా లక్ష్యాన్ని సాధించే వరకు కృషి చేస్తానని వారి నమ్మకాలను భావజాలాన్ని గౌరవిస్తూ నా విధులను నిర్వహిస్తానని మనస్సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నానని గిరిజన సం పూర్ణ ఉన్నతి నా కర్తవ్యం అని ప్రతిజ్ఞ చేశా రు.

మూడు రోజుల శిక్షణ పొందిన కమిటీ సభ్యులకు సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సహాయ ప్రాజెక్టు అధి కారి జనరల్ డేవిడ్ రాజ్, ఏవో సున్నం రాం బాబు, డిఎంటి కమిటీ సభ్యులు మధువరన్, రాంబాబు, సలీం, జగదీష్, ప్రశాంత్, సంతోష్ రూప తదితరులు పాల్గొన్నారు.