05-09-2025 12:48:26 AM
కలెక్టర్ అభిలాష అభినవ్
భైంసా, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): పండగలు ఉత్సవాలను శాంతియుతంగా సోదర భావంతో నిర్వహించుకోవాలని వాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. భైంసాలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో గురువారం పట్టణంలోని మున్నూరు కాపు సంఘంలో ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్‌తో కలిసి వినా యకుడికి పూజలు చేసి గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు.
అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ , ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పటేల్, మున్సిపల్ మాజీ చైర్మన్ బి గంగాధర్ పట్టణ ప్రముఖులు మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు. అనంతరం హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అధికారులు నాయకులు పట్టణ సమీపంలోని గడ్డన జలాశయంలో విగ్రహాలను లాంఛనంగా నిమజ్జనం చేశారు.