3 August, 2026 | 10:32 PM

ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు అండగా ఉంటా..

23-08-2024 09:02 PM

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు

తుంగతుర్తి ఆగస్టు 23,(విజయక్రాంతి): ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు అండగా ఉంటానని బీఆర్ఎస్ 9 సంవత్సరాల పాలలో కాంగ్రెస్ కార్యకర్తలకు దాడులు కేసులు అనుభవించారని, బిఆర్ఎస్ నాయకుల దాడులు చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. అనంతరం దవాఖానాలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ కార్యకర్తలను పరామర్శించి ధైర్యం తెలిపారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... త్యాగాల తెలంగాణలో భోగాల అనుభవించినగా.. బిఆర్ఎస్ బ్రోకర్ గాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దివాలాకోరుతనంతో తిన్నదంతా కక్కిస్తారనే భయానికి లోనవుతూ చిల్లర కార్యక్రమాలు చేపట్టి శాంతియుతంగావున్న తుంగతుర్తి నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించాలని చూడడం గురువారం కాంగ్రెస్ కార్యకర్తలపై రాళ్ల దాడి చేయడం ఎమ్మెల్యే  ఖండించారు. నియోజకవర్గ అభివృద్ధికి సాయి శక్తుల కృషి చేస్తానని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తిరుమలగిరి మండలంలో జూనియర్ కాలేజీని ఏర్పాటు చేసిన అని తెలిపారు. తుంగతుర్తి మోత్కూరులో రామన్న రోజుల్లో డిగ్రీ కాలేజ్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టన్నారు. రైతు రుణమాఫీ రెండు లక్షల విషయంలో బ్యాంకు  ఎకౌంట్లో పొరపాట్లు, పాన్ కార్డ్ ఆధార్ కార్డులో మార్పులు, కొంతమంది బ్యాంకు మేనేజర్లు రైతుల ఎకౌంటు మార్చకపోవడంతో నష్టం వాటిల్లిందని, నియోజవర్గములోని ప్రతి రైతు రుణమాఫీ జరిగే విధంగా కృషి చేస్తానని అన్నారు.