ప్రిన్సిపాల్‌పై బదిలీ వేటు వేసిన కలెక్టర్
23-08-2024 08:52 PM
ఆదిలాబాద్, ఆగస్టు 23(విజయ క్రాంతి): ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల ప్రిన్సిపాల్ పై బదిలీ వేటు పడింది. పాఠశాల ప్రిన్సిపాల్ సంగీత తమను బెదిరింపులకు గురిచేస్తుందని విద్యార్థులు నిన్న మావలలోని పాఠశాల నుండి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు కాలినడకన వచ్చి నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా సీరియస్ అయ్యారు. వెంటనే ఆర్డీవో వినోద్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజలింగును ఘటనపై విచారణ చేపట్టాలంటే ఆదేశించారు. అధికారులు విచారణ చేపట్టి ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రిన్సిపాల్ సంగీతపై శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఆమెను ఇచ్చోడకు బదిలీ చేస్తూ శుక్రవారం కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.






