27 July, 2026 | 7:51 PM

Breaking News

మండల సమావేశాన్ని బహిష్కరించిన ఫీల్డ్ అసిస్టెంట్లు   •   దోరకుంటలో వన మహోత్సవం   •   చిన్నకాపర్తి చెరువులకు పిలాయిపల్లి కాలువ నీరు అందించాలి   •   ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం   •   మూడేళ్లుగా కూలిన హాస్టల్ గోడ.. పునర్నిర్మించాలని పీడీఎస్‌యూ డిమాండ్   •   దళితుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి   •   సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా చేతికి రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'చెన్నై లవ్ స్టోరీ' డిజిటల్, శాటిలైట్ హక్కులు   •   రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుతో లబ్ధి పొందాలి   •   ఆర్థిక సాయం అందించిన టూ వీలర్ మెకానిక్ వర్కర్స్ యూనియన్   •   అశ్వాపురంలో గంజాయి పట్టివేత   •  

తప్పు చేస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టం

31-10-2025 05:43 PM

ఆడపిల్లలను వేధిస్తే చర్యలు కఠినంగా ఉంటాయి

సమస్యపై నిమిషాల్లోనే స్పందించి, నిందితుడు పై చర్యలు తీసుకునేలా చేశాం

విద్యార్థులను వేధించిన ఘటనలో పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 

చొప్పదండి,(విజయక్రాంతి): ఆడపిల్లలను వేధిస్తే వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హెచ్చరించారు. మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను వేధించిన ఘటనలో శుక్రవారం పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పాఠశాలల్లో ఉన్న సమస్యల గురించి తనకు సమాచారం ఇవ్వాలని, పెద్దన్నలా అండగా ఉండి సమస్యలను పరిష్కరిస్తానని భరోసా కల్పించారు. 

పాఠశాలలో విద్యార్థులను వేధించిన ఘటనలో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, హైదరాబాద్, జిల్లా కలెక్టర్ తో మాట్లాడి నిమిషాల్లోనే నిందితుడైన అటెండర్ను, విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన హెచ్ఎం ను సస్పెండ్ చేయించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు నిత్యం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. విద్యార్థులపై ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.