31-10-2025 05:50:32 PM
 
							నకిరేకల్,(విజయక్రాంతి): కట్టంగూరు మండలంలోని చెర్వు అన్నారం ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న చింతకాయల పుల్లయ్య పి ఆర్ టి యు టీఎస్ కట్టంగూర్ మండల శాఖ నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి జ్ఞాన ప్రకాష్ రావు మండల విద్యాధికారి అంబటి అంజయ్య గార్లను మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిసి పూలబొకే అందించారు. ఈ సందర్భంగా వారు చింతకాయల పుల్లయ్యను శాలువాతో సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ సూపర్డెంట్ చలపతి ,మండల ఏపీవో కడియం రామ్మోహన్, పిఆర్టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు చిన్ని శ్రీనివాస్, విట్టల్, కట్టంగూరు మండల శాఖ అధ్యక్షులు నిమ్మనగోటి వెంకటరమణ,మండల అసోసియేట్ అధ్యక్షులు చెందపాక నరేష్ తదితరులు పాల్గొన్నారు.