calender_icon.png 14 January, 2026 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక ప్రమాదం.. జీవితకాలం ప్రభావం

14-01-2026 12:04:03 AM

ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్

నాగర్ కర్నూల్, జనవరి 13 (విజయక్రాంతి ): అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్ వంటి కారణాల చేత జరిగిన ఒక ప్రమాదం ఆ వ్యక్తులపై జీవితకాలం ప్రభావం చూపుతుందని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎర్రివ్ అలివ్  కార్యక్రమంలో భాగంగా రోడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలను భయంతో కాదు, బాధ్యతతో పాటించాలన్నారు.

రోడ్డు ప్రమాదాలు ఒక్క క్షణంలో జరిగి కుటుంబాలపై జీవితకాల ప్రభావం చూపుతాయని తెలిపారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్/సీట్బెల్ట్ ధరించకపోవడం, మొబైల్ ఫోన్ వాడకం ప్రమాదాలకు ప్రధాన కారణాలన్నారు. రోడ్ సేఫ్టీ అనేది పోలీసులదే కాదు ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు, రోడ్డు ప్రమాద బాధితుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.