01-11-2025 06:09:15 PM
పాపన్నపేట,(విజయక్రాంతి): మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ జన్మదిన వేడుకలు పాపన్నపేట మండలంలో శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఏడుపాయల్లో పార్టీ శ్రేణులు రోహిత్ పేరున వనదుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం ప్రాంగణంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పాపన్నపేట మండల కేంద్రంలో సైతం పార్టీ శ్రేణులు కేక్ కట్ చేశారు.