1 July, 2026 | 1:33 AM

రాజ్ నగర్‌లో పర్యటించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్

01-07-2026 12:32 AM

జూబ్లీహిల్స్, జూన్ 30 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రాజ్ నగర్లో స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పర్యటించారు. పర్యటనలో భాగంగా అక్కడ జరిగిన ఎస్‌ఐఆర్ కార్యక్రమ ప్రక్రియను పరిశీలించారు. ప్రజలకు ఎన్యుమరేషన్ ఫారంలను అందజేశారు. ఓటర్లు సరైన విధంగా వివరాలను నమోదు చేసేందుకు సహకరించారు. అనంతరం నివాసితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

కాలువలు, సీసీరోడ్లు, పారిశుద్ధ్యం, తాగునీటి పలు సమస్యలను వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమస్యలన్నింటినీ దశలవారీగా పరిష్కరిస్తామని హామీనిచ్చారు. రాజ్ నగర్‌ను ఆదర్శవంతమైన కాలనీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.