1 July, 2026 | 1:34 AM

రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి

01-07-2026 12:30 AM

టీఆర్‌ఎస్ (డీ) పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరాల సత్యనారాయణ

ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద రైతుసింహ గర్జన

ముషీరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని టిఆర్‌ఎస్ (డి) పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు నరాల సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు రెండు లక్షల వరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలన్నారు. ఈ మేరకు మంగళవారం రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ టిఆర్‌ఎస్ (డి) పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో రైతుసింహ గర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నరాల సత్యనారాయణ మాట్లాడుతూ  రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలన్నారు. రైతు మోటార్ల పై మీటర్లు పెట్టకూడదని, మక్కాను కొనుగోలు చేయాలన్నారు. రైతు పండించిన ధాన్యానికి గరిష్ట ధర నిర్ణయించి కొనుగోలు చేయాలన్నారు. పసుపు రైతులకు న్యాయం చేయాలన్నారు.  కౌలుదారులకు కౌలు భద్రతా చట్టాన్ని ఏర్పాటు చేయాలన్నారు.

రైతు కూలీలకు12 వేల రూపాయలు ఇవ్వాలని, రైతు బీమా ఐదు లక్షల వరకు వర్తింప చేయాలి రైతుబంధు ప్రతి ఎకరాకు15వేల రూపాయలు ఇవ్వాలని, రైతులకు గ్రామీణ బ్యాంకుల ద్వారా, సహకార పరపతి సంఘాల ద్వారా వడ్డి లేని రుణాలు ఇవ్వాలన్నారు.  ప్రభుత్వమే నాణ్యమైన వ్యవసాయ విత్తనాలు ఇవ్వాలన్నారు.  ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గోగర్ల రాజేశం, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు కుమ్మరి లింగయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీకాంత్, మధు, రాష్ట్ర మహిళా కమిటీ సింగం తార, పర్వీన్, సిరి వేరు శారద తదితరులు పాల్గొన్నారు.