19-01-2026 07:39:54 PM
గరిడేపల్లి,(విజయక్రాంతి): మండలంలోని కొత్తగూడెం గ్రామపంచాయతీకి నూతనంగా ఎన్నికైన సర్పంచి నకరికంటి సుధా నాగరాజు గ్రామ ప్రజాప్రతినిధులు సోమవారం ఎస్ఐ చలిగంటి నరేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలు శాలువలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ఐ నరేష్ నూతనంగా ఎన్నికైన సర్పంచి, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామాభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణలో సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.