మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రభుత్వ ఐటిఐ కాలేజీ ప్రాంగణంలో నూతన గ్రంథాలయంను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం ప్రారంభించారు. అనంతరం గ్రంథాలయంలోని పుస్తకాలను పరిశీలించి, పుస్తకాలను చదివి గ్రంథాలయం ఆవరణంలో మొక్కని నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రంథాలయాలు విజ్ఞాన గనులు అని గ్రంథాలయంలో చారిత్రాత్మక పుస్తకాలను చదవడం వలన విద్యార్థులు యువకులు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మణుగూరు తహసిల్దార్ రాఘవరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంపీఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు, మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, పిరినాకి నవీన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.