24 February, 2026 | 10:51 PM

అసిస్టెంట్ కరెంట్ హెల్పర్ నియామకానికి వినతి

24-02-2026 09:04 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండల పరిధిలోని భూక్యా రెడ్డి తండా, కమ్మరిపేట తండా, అజ్మీరా తండా గ్రామాలకు ప్రత్యేకంగా అసిస్టెంట్ కరెంట్ హెల్పర్‌ను నియమించాలని సర్పంచులు బానోత్ నరేష్ నాయక్, జయరాంలు సెస్ ఏఈ దివ్యకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా నరేష్ నాయక్ మాట్లాడుతూ... రాబోయే వేసవికాలంలో ఓవర్‌లోడ్ కారణంగా తరచూ కరెంట్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. గతంలో ఐదు గ్రామాలకు ఒక్క కరెంట్ హెల్పర్ మాత్రమే ఉండటంతో పనులు సకాలంలో పూర్తికావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల ప్రస్తుత అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ మూడు గ్రామాలకు ప్రత్యేకంగా అసిస్టెంట్ హెల్పర్‌ను నియమించాలని అధికారులను కోరారు.