24 February, 2026 | 11:04 PM

తలసీమియా వ్యాధులు వ్యాధిగ్రస్తులకు అధునాతన పరికరంతో సేవలు

24-02-2026 09:35 PM

జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

భద్రాచలం,(విజయక్రాంతి): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హాస్పిటల్ భద్రాచలం సేవలను విస్తృతపరుస్తూ, అధునాతన పరికరమును అవిష్కరించిన జిల్లా కలెక్టర్ హితేష్ వి పాటిల్ భద్రాచలం పట్టణంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హాస్పిటల్ సేవలను విస్తృతపరుస్తూ రూ.9 లక్షల 25 వేల విలువైన అధునాతనమైన పరికరమును జిల్లా కలెక్టర్  మంగళవారం ఆవిష్కరించినారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తలసేమియా. సికిల్సెల్ ఎనిమియా వ్యాధి గ్రస్తులకు ఈ పరికరం ఉపయోగపడనుందని, హెచ్ఐవి, హైపటైటిస్-బి, హైపటైటిస్-సి తదితర రక్త పరీక్షలను త్వరితగతిన ఫలితాలను అందజేస్తుందని తెలిపినారు.

గిరిజన సంక్షేమం కొరకు, మారుమూల గిరిజన గ్రామాలలో వైద్యసేవలను మెరుగుపరచాలని, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు వైద్యశాఖ వారి సహకారంతో మారుమూల గిరిజన ప్రాంతంలో అంధత్వ నివారణ కొరకు కంటి చూపు తగ్గిన వారికి పరీక్షలు చేసి ఉచిత కంటి శస్త్ర చికిత్సా శిబిరాలు నిర్వహించాలని, కేన్సర్ వ్యాధి నివారణ కొరకు వైద్య శిబిరాలు నిర్వహించాలని, తలసేమియా, సికిల్సెల్ ఎనిమియా పేషెంట్ ల సంక్షేమం కొరకు రక్తదాన శిబిరాలను నిర్వహించాలని, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలను అభినందిస్తూ.. విస్తృత పరచాలని కోరినారు.

జిల్లా కలెక్టర్  సలహాలు, సహకారానికి జిల్లా రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ ఎస్. ఎల్. కాంతారావు  ధన్యవాదాలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఐటిడిఎ పీవో బి. రాహుల్, అడిషనల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ డి. వేణుగోపాల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ, ఏఎస్పీ విక్రమ్ కుమార్ సింగ్, తహశీల్దార్ డి. వెంకటేశ్వర్లు పాల్గొనగా, రెడ్ క్రాస్ సభ్యులు డా. ఎస్.ఎల్.కాతారావు రెడ్ క్రాస్ జిల్లా కోఆర్డినేటర్, వై. సూర్యనారాయణ, జి.రాజారెడ్డి, గోళ్ళ భూపతిరావు, డా॥వి. కామేశ్వరరావు, పి. దేశప్ప, బి.హరిశ్చంద్ర నాయక్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.