15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

రాష్ట్ర స్థాయి క్రీడల్లో సిద్దిపేట పోలీసుల సత్తా విజేతలకు సీపీ అభినందనలు

24-02-2026 09:30 PM

సిద్దిపేట క్రైం: నాలుగో తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడలు, స్పోర్ట్స్ మీట్ లో సిద్దిపేట పోలీసులు సత్తా చాటారు. అద్భుత ప్రతిభ కనబరిచిన సిద్దిపేట జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ క్రీడల్లో సిద్దిపేట పోలీస్ యూనిట్ నుండి మొత్తం 9 మంది వివిధ విభాగాల్లో పోటీపడి, తమ ప్రతిభను ప్రదర్శించారు.

మొత్తం 12 పతకాలను సాధించి సిద్దిపేట పోలీస్ శాఖ సత్తాను రాష్ట్ర స్థాయిలో చాటారు. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ రోహిత్, సబ్ ఇన్స్పెక్టర్ అంజయ్య, కానిస్టేబుల్ డి.రాజు బంగారు పతకాలు సాధించారు. డి.లక్ష్మణ్, జె.రాజు వెండి పతకాలు పొందారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి పతకాలు సాధించాలని సీపీ ఆకాంక్షించారు.  కార్యక్రమంలో  అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఇన్స్పెక్టర్లు కిరణ్, శ్రీధర్ గౌడ్  పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.