10 April, 2026 | 10:48 PM

నేడు మండలంలో ఎమ్మెల్యే పాయం పర్యటన

10-04-2026 09:14 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండలంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం పర్యటించనున్నట్లు ఎంపీడీవో జమలారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు బూర్గంపహాడ్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లకు గృహప్రవేశాలు, 9.30 గంటలకు రెసిడెన్షియల్ జూనియర్ బాలికల కళాశాలలో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం, 10 గంటలకు తహశీల్దార్ కార్యాలయంలో లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీలో పాల్గొంటారని తెలిపారు.