12-05-2025 01:25:25 AM
కామారెడ్డి, మే 11,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం (telangana governament) విడుదల చేసిన ఈఏపీసెట్ ఫలితాల్లో (EAPSET results) సాందీపని కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఉత్తమ ర్యాంకులు సాధించి సత్తా చాటారని పాఠశాల యాజమాన్యం తెలిపింది.
అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో (agriculture pharmacy category) గోలివడ్డ నవదీప్ 3,443 ర్యాంకు, సర్వత్ ఫాతిమా మసీర 3,850, సాయి రిశ్విత రెడ్డి 4,265, భాగ్యలక్ష్మి 6,001, మన్సీరా మలిహ 6,399, బిలాల్ 9,177, రిత్విక్ 9,965, ఇంజినీరింగ్ విభాగంలో (engineering category) సీహెచ్ శివ కార్తీక్ 6,979 ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థులను, ఉపన్యాసకులను అభినందించి విద్యార్థుల తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపింది.